వినియోగదారుల హక్కులపై రాష్ట్ర వ్యాప్త ప్రతిభా పోటీలు
విశాఖపట్నం:
-696 మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు
--ఆప్ కి అవాజ్, సిఎపీసివో ఆధ్వర్యంలో నిర్వహణ
విశాఖపట్నం, నవంబర్1: వినియోగదారుల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభాపోటీలు నిర్వహించనున్నట్లు ఆప్ కి అవాజ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పివిజి విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్యూమర్ ఆర్గనైజేషన్లు సహకారంతో ఈ ప్రతిభా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 696 మండల కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్ధులకు అవగాహన నిర్వహించి తదుపరి ప్రతిభా పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు ఆప్ కా అవాజ్ సంస్థ తరుపున బహుమతులు అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే అన్ని జిల్లా అధికార యంత్రాంగాల నుంచి తగిన సహకారం ఇవ్వాలని ప్రభుత్వం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లుకు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు విశ్వనాధ్ చెప్పారు. ఆప్ కా అవాజ్ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఆయా సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అవసరమైన సహకరం అందిస్తామన్నారు. వినియోగదారులకు అవసరమైన సేవలందించడానికి స్వచ్చందంగా ఈ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ ఎస్ రామ కృష్ణ, రాష్ట్ర సమన్వయకర్త సుదర్శన్, పీఆర్‌వో మర్రి సత్యనారాయణ, సంస్థ రాష్ట్ర కార్యదర్శులు నరహరిశెట్టి శ్రీధర్, డాక్టర్ రాజులు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న పనులు, అవగాహన కార్యక్రమాలు విపులంగా వివరించారు. ప్రత్యేకంగా మురికివాడలు, లోతట్లు ప్రాంతాల ప్రజలకు వైద్యశిబిరాలు నిర్వహించి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు.అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను ముందుగా వీరంతా అవిష్కరించారు.


