స్వచ్ఛందంగా పందులను నగర పరిధి దాటించిన పెంపకం దారులు.

స్వచ్ఛందంగా పందులను నగర పరిధి దాటించిన పెంపకం దారులు.

     మధురవాడ:     

విశాఖపట్నం,నవంబర్-1:- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ  పరిధిలోని పందుల పెంపకం దారులు స్వచ్ఛందంగా తమ పందులను నగర పరిధి నుండి తరలిస్తున్నట్లు జివిఎంసి కమిషనర్ పి. రాజాబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జోన్-2567 పరిధిలో జివిఎంసి వెటర్నరి డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో పందుల నిర్మూలనకు నలుగురు గన్ మెన్లతో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామని మంగళవారం ఒక్క రోజే 108 పందులను కాల్చి చంపామనిజోన్-2 పరిధిలో పందుల పెంపకం దారులు సుమారు 215 పందులను స్వచ్ఛందంగా నగర బయటకు తరలించారని, అలాగే మిగిలిన పందుల పెంపకం దారులు స్వచ్చందంగా తరలించాలని తెలిపారు.  పర్యావరణానికి, నగర పరిశుభ్రతకు, ప్రజా ఆరోగ్యానికి పందుల వలన తీవ్ర విఘాతం కలుగుతుందని, తిండి కోసం రోడ్ల మీద డస్ట్ బిన్లలో ఉన్న వ్యర్ధాలను చిందర వందరగా పడవేస్తున్నాయని అంతేకాకుండా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో ఆహారం కొరకు చొరబడి వారిని గాయపరిచిన సందర్భాలు ఉన్నాయని, పందుల పెంపకం దారులకు ఎన్ని పర్యాయములు హెచ్చరించిననూ పందులను నగరం నుండి తరలించడం లేదని అందుకొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి  పందుల నిర్మూలనా కార్యక్రమం చేపట్టడం జరిగిందనిగత పది రోజుల నుండి ఇటువంటి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి  1500 పైనే పందులను నిర్మూలించడం జరిగిందనిదాని ఫలితంగా జోన్-2 పరిధిలోని పందులు పెంపకం దారులు మంగళవారం పందులను స్వచ్చందంగా నగరం నుండి తరలించారన్నారు. అలాగే అన్ని జోన్లలోని పందులు పెంపకం దారులు స్వచ్ఛందంగా తమ పందులను నగరం బయటకు తరలించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పందుల నిర్మూలనలో విధులకు ఆటంకం కలిగించే పందుల పెంపకం దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.