నవంబర్ 4 నుంచి భవానీ దీక్షలు మొదలు

నవంబర్ 4 నుంచి భవానీ దీక్షలు మొదలు 

విజయవాడ:

విజయవాడ: నవంబర్ 4 నుంచి డిసెంబర్ 19 వరకు భవాని దీక్షలు మొదలుకానున్నాయి. మండల దీక్షలు 4 నుంచి 8 వరకు... అర్థ మండల దీక్షలు 24 నుంచి 28 వరకు వేయనున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 7న శివరామ క్షేత్రం నుంచి కలసి జ్యోతుల మహోత్సవం నిర్వహించనున్నారు. శివరామ క్షేత్రం నుంచి ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, కంట్రోల్ రూమ్ మీద దుర్గ గుడికి కలశ జ్యోతులు ఊరేగించనున్నారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 15న భవాని దీక్ష విరమణలు ఉంటాయి. దీక్ష విరమణలకు ప్రత్యేక హోమ గుండాలను ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 19న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి. డిసెంబర్ 15 నుంచి 19 వరకు అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, ప్రత్యక్ష సేవలు రద్దు కానున్నాయి.