ఈస్టర్న్ విశాఖ లో రాష్ట్రీయ ఏక్తా దివస్
భీమిలి వి న్యూస్ ప్రతినిధి
స్డానిక బోయపాలెం లోని ఈస్టర్న్ విశాఖ పాఠశాలలో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని ఆచరించారు. ఈ సంధర్బంగా ఈస్టర్న్ విశాఖ విద్యాసంస్దల అధినేత బిషప్ డా. కె . ఆర్ . సింగ్ గారు మాట్లాడుతూ భారతదేశ పౌరలందురు ఐక్యతతో మరియు సంమగ్రతతో మేలగాలని విద్యార్ధిని, విద్యార్ధులకు దిశనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ బి.ఈశ్వరరావు , ప్రధానోపాధ్యాయులు వై . చార్లెస్ కుమార్ మరియు శ్రీమతి వి . ఝాన్సి రాణి విద్యార్ధిని, విద్యార్ధులచే ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్ధిని, విద్యార్ధులు పలికిన నినాదాలు మరియు ప్లకార్డులు ఆహుతులను ఎంతగానో ఆకర్షీంచాయి.

