ఉత్తమ వ్యక్తిత్వంతోనే ఉజ్జ్వల భవిష్యత్

 ఉత్తమ వ్యక్తిత్వంతోనే ఉజ్జ్వల భవిష్యత్

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి

ఉత్తమ వ్యక్తిత్వ వికాసమే విధానమని, సాధనతోనే జీవితానికి చోదక శక్తి లభిస్తుందని ప్రముఖ మనోవికాస నిపుణులు రాంబుడ్డి గణపతి విద్యార్థులకు హితబోధ చేసారు. మంగళవారం భీమిలి నియోజకవర్గంలో  గల చంద్రం పాలెం ఉన్నత పాఠశాలలో మనోవికాస తరగతులు నిర్వహించారు. విద్యార్థి దశలో సానుకూల దృక్పథంతో గుణాత్మక విద్యను అభ్యసించి భవిష్యతక్కు విజయ బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థులు లక్ష్మ సాధకులు గా మారి ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలవాలన్నారు. 

ప్రపంచంలో మానవుడు ముందడుగు వేసాడంటే దానికి అంతర్జాలం ఒక మెట్టుగా భావించాలని అయితే వాటిని మానవ పురోగాభివృద్ధికి సద్వినియోగ పర్చుకోవాలని సూచించారు. అంతర్జాల దుర్వినియోగం మనిషి పతనానికి తిరోగమనానికి కారణం కాకూడదని ఉద్భవించారు. విద్యార్థి దశ ఆక్షరణలు, వికృత చేష్ఠలు, సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలన్నారు. మీ అపజయాలు తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి భవిష్యత్ డే మీరేం చేయరాదో తెలిపే పాఠాలుగా భావించి ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానో - ధ్యాయులు ఎమ్. రాజుబాబు మరియు ఉపాధ్యాయి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.