మానసిక ఒత్తిడికి గురైన వీఆర్వో లు
భీమిలి వి న్యూస్ ప్రతినిధి
పద్మనాభం మండలంలో పనిచేస్తున్న వీఆర్వోలు సమయపాలన లేకుండా విధులు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నామని ప్రభుత్వం సమయపాలన కేటాయించాలని ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించుట రైతులు వద్ద నుండి భూమిని సేకరించుట సదరు సేకరించిన భూమిలో లేబౌట్ చేయించుట లేఔట్ లో రాలులు పాతించుట లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగించుట కార్యక్రమం గత రెండు సంవత్సరముల నుండి రాత్రులు పగలు నిరంతరము సమయపాలన లేకుండా పనిచేస్తున్నామని.
ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతూ లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయాలని రెవెన్యూ అధమయిసి వ్యవసాయ సాగకు చెందిన ఈక్రాఫ్ ఎలక్షన్ విధులలో భాగంగా వాటర్ లిస్టులో గల పేర్లుకు ఆధార్ అనుసంధానం చేయుటకు ఫారం సిక్స్ బి సేకరించుట మరియు రోజువారి పనుల్లో భాగంగా కుల ఆదాయ ఇతర ధృవీకరణ పత్రములు స్పందన పిటిషన్లు నిర్ణీత సమయంలో దర్యాప్తు చేసి పై అధికారులకు నివేదిక సమర్పించుట జరుగుచున్నది అయితే పైపన్నులన్నీ ప్రాధాన్యత క్రమంలో కాకుండా అన్ని పనులు ఒకేసారి మాపై అధికారులు చెప్పుటవలన సమయపాలన లేకుండా వీఆర్వోలు విధులు నిర్వహించటం వల్ల మానసిక ఒత్తిడికి అనారోగ్యానికి గురవుచున్నారు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్షణ పథకంలో భాగంగా భూములు రిసర్వ్ చేయించుటకు గాను తొందరగా రీ సర్వే పూర్తి చేయవలసిందిగా తాసిల్దారులు ఆదేశించి ఉన్నారు భూములు రీ సర్వే ప్రక్రియ తగిన సిబ్బంది ఇవ్వకుండా తొందరగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు మరియు రైతులను రప్పించి చేయవలసిన పని కానీ చాలామంది రైతులు సంబంధిత గ్రామాల్లో నివాసం ఉండరు భూములు రీ సర్వే సంబంధించి ఇతర మండలాల నుండి వచ్చిన సిబ్బంది భోజనాలు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చవలసిందిగా ఆదేశించుచున్నారు సదురు వీఆర్వోలుకు ఆర్థిక భారం యున్నది కావున రీసర్వే కు సంబంధించి సిబ్బంది భోజనాలు మౌలిక సదుపాయాలు విఆర్వోలు పై ఆర్థిక భారం లేకుండా చేయవలసిందిగా కోరుతున్నారు ఇటీవల కొన్ని మండలాల్లో పనిచేయుచున్న విఆర్వోలు పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి వలన ఆక్సిడెంట్లు గురైనరు మరియు కొంతమంది గుండు పోటు వచ్చి చనిపోవడం మరి కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి వైద్యము పొందుతున్నారు ఇలా ప్రతి మండలంలో విఆర్వోలు అనారోగ్యానికి గురి అయినారు కావున మండల తాసిల్దారు వారు మా యందు ధైర్యం నుంచి ప్రాధాన్యత క్రమంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు అప్పగించిన నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయగలమని అలాగే సెలవు దినములో మా కుటుంబ సభ్యులతో గడుపుటకు మాకు సెలవు ఉపయోగించుకొనుటకు వీలు కల్పించవలసిందిగా కోరుతున్నామని తెలియజేసినారు ఈ అభ్యర్థనను మండల తాసిల్దారు లోకేశ్వరరావు స్వీకరించడం జరిగింది.

