మా కుటుంబం అంటే అమ్మా, నాన్న, చెల్లీ, నేనే కాదు, గంటా అభిమానులందరూ మా అభిమానులే : గంటా రవి తేజ

మా కుటుంబం అంటే అమ్మా, నాన్న, చెల్లీ, నేనే కాదు, గంటా అభిమానులందరూ మా అభిమానులే : గంటా రవి తేజ

విశాఖ వి న్యూస్ ప్రతినిధి:

రాష్ట్ర మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మేల్యే గంటా శ్రీనివాస్ రావు కుమారుడు గంటా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గంటా అభిమానులు , శ్రేయోభిలాషులు వేలాది గా ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియ చేశారు. మొదట ఎంవిపి కాలనీ లోని గంటా నివాసానికి వచ్చిన అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనకాపల్లి వరకు జరిగిన ర్యాలీ లో పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు గాజువాక జంక్షన్ లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా రవి తేజ మాట్లాడుతూ నా జన్మదినోత్సవం సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, ఆశీర్వదించిన పెద్దలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంత పెద్ద ర్యాలీ ని నిర్వహించిన గంటా అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

నకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ మధ్యే పెరిగాను. నా ఎదుగదల మీ అందరి ఆశీర్వాదాలు తోనే సాగింది. నా కుటుంబం అంటే అమ్మా, నాన్న, చెల్లి, నేనే కాదు, మీరంతా మా కుటుంబమే. నాకు తెలిసి నాన్న  ఏ నిర్ణయం తీసుకున్నా మనందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ చూస్తూ పెరిగిన నేను కూడా మీ అందరి మధ్యనే ఉండడానికి ఇష్టపడుతాను. అందుకే ఈరోజు మీ అందరిమద్య ఇలా పుట్టిన రోజు పండుగ జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది శ్రేయోభిలాషుల ఆశీస్సులు పొందడం పూర్వ జన్మ సుకృతం కాకపోతే మరేంటి? ఎన్ని జన్మలు ఎత్తినా మీ మధ్యే ఉండాలని, మీతోనే పెరగాలని, నాన్న  చూపిన మార్గంలో, నాన్న  వేసిన బాటలో ముందుకు నడుస్తూ సమాజ సేవకు అంకితం అవుతానని ఈ సందర్భంగా "ఘంటా"పదంగా చెబుతున్న ఆంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.