బెట్టింగ్... బెట్టింగ్ ! టి20 వరల్డ్ కప్ ఫీవర్. జోష్లో లో అభిమానులు.

బెట్టింగ్... బెట్టింగ్ ! టి20 వరల్డ్ కప్ ఫీవర్. జోష్లో లో  అభిమానులు.              


బెట్టింగ్ రాయుళ్ల జోరు.     


                    జేబులు ఖాళీ చేసుకుంటున్న యువత                                      

దేశ వ్యాప్తంగా టీ20 క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ వరల్డ్ కప్ మొదలు ముగిసే వరకు.. క్రికెట్ అభిమానులకు కన్నుల పండగే . ఆస్ట్రేలియా కేంద్రంగా టి20 వరల్డ్ కప్ సీజన్ ప్రారంభం కావడంతో  సాయంత్రం అయితే చాలు  బెట్టింగుల సందడి మొదలవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్రికెట్ అభిమానుల బలహీనతలే బెట్టింగ్ రాయళ్లకు కానుక వర్షం. కురిపిస్తుంది క్రికెట్ బెట్టింగుల కోసం ఒక ప్రత్యేక వ్యాప్ ను సైతం రూపకల్పన చేశారంటే  పరిస్థితులను ఊహించుకోవచ్చు. ఆన్లైన్లో బెట్టింగులు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. రోజువారి కూలీ పనులను చేసుకునే వారు సైతం బెట్టింగులు పాల్గొనడం. సంపాదించిన కొద్ది సొమ్ము కోల్పోయి ఆర్థికంగా నష్టపోవడం జరుగుతోంది. అన్ని వర్గాల వారు టీవీలకు అతుక్కుపోతున్నారు. వివిధ వర్గాల వారిని ఆకర్షిస్తూ బెట్టింగులోకి లాగుతున్నారు. గతంలో మ్యాచ్లను చూసి ఆనందించేవారు.మనదేశంలో క్రికెట్ ను ఆదరించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పరాయి దేశాలకు చెందిన ఆటగాళ్లకు సైతం  పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మామూలుగా రెండో దేశాల మధ్య పోరు జరగడం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ సీజన్ ప్రారంభమైంది. టి20 వరల్డ్ కప్ లో టాస్ వేసేది మొదలు  మ్యాచ్ ముగిసే వరకు ప్రతి అంశంపై బెట్టింగులు నడుస్తున్నాయి. క్రికెట్ బెట్టింగులలో ఆరితేరిన నిర్వాహకులు రకరకాలుగా పందెలు కాస్తుంటారు. మొదటి బాల్ నుంచి బెట్టింగులు మొదలైపోతాయి . జట్టు మీద ఆటగాళ్ల మీద సైతం పందెగాళ్లు రెచ్చిపోతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు ? ముందుగా ఏ జట్టు బ్యాటింగ్ చేస్తుంది? ఫస్ట్ బాల్ కు వికెట్ పడుతుందా ... మొదటి ఓవర్ లో ఎన్ని రన్స్ కొడతారు. 5 ఓవర్లలో ఎన్ని రన్స్ కొడతారు. ఇలా పందాలు కాస్తుంటారు. ఎవరు సంచరి చేస్తారు? లేదంటే రెండు సిక్స్ లు కొడతాడంటూ పందాలు కాస్తుండడం విశేషం. ఇంకా బోల్డ్ 90 ప్లేయింగ్ అంటూ బెట్టింగ్ నిర్వహించేవారు బ్యాటింగ్ చేస్తున్న వారిపై సుమారు రూ 900 బెట్టింగ్ కాస్తే అవతలివారు రూ1000 ఇస్తారన్నమాట. ఇలా రకరకాలుగా పందాలు కాస్తున్నారు. బెట్టింగులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న వారు బెట్టింగ్ ప్రక్రియ మొత్తం చరవాణి ద్వారానే నిర్వహిస్తున్నట్లు పేర్కొనడం గమనారం. అలాగే ప్రత్యేకంగా రూపకల్పన చేసిన యాప్,వెబ్సైట్లు ద్వారా పందాలు కాస్తు తమ కష్టార్జితాన్ని బూడిద పాలు చేసుకుంటున్నారు. క్రికెట్ పందే సమయంలో ఎక్కువ శాతం టీవీల ముందు కూర్చుని పందాలు కాసే వారే పోలీసులకు చిక్కడం విశేషం నిర్వాహకులు మాత్రం తప్పించుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు ఎటువంటి ఆధారాలు లేని మొబైల్ నెంబర్లను వినియోగిస్తూ. అవతలి వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. క్రికెట్ బెట్టింగును వ్యసనంగా మార్చుకున్న యువత అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. ఇలా బెట్టింగులతో నష్టపోతున్న యువతను కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం  బెట్టింగ్ నిర్వాహకుల జాడ పట్టకుండా  జాప్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా టి20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుండటంతో పోలీస్ యంత్రాంగం స్పందించి క్రికెట్ బెట్టింగులపై ప్రత్యేక నిఘా ఉంచి ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.