గురుస్థానం ది ప్లే స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి
మహా విశాఖ,గురుస్థానం ది ప్లే స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను పాఠశాల డైరెక్టర్ ఎస్.ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు మరియు వారి గ్రాండ్ పేరెంట్స్, పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలలో చురుగ్గా పాల్గొన్నారు.
ఆనంతరం పాఠశాల డైరెక్టర్ ఎస్.ఖాన్ మాట్లాడుతూ పిల్లలకు నైతిక విలువలు, నడవడిక మొదలైన వాటిని నేర్పించడంలో గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషా కె, డైరెక్టర్ ఎస్ ఖాన్, ప్రిన్సిపాల్ గౌసియా బేగం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

