త్రాగునీరును అందివ్వటంలో అలసత్వం మంచిది కాదు.కార్పొరేటర్ మొల్లి హేమలత డిమాండ్.

త్రాగునీరును అందివ్వటంలో  అలసత్వం మంచిది కాదు.కార్పొరేటర్  మొల్లి హేమలత డిమాండ్.


తక్షణమే కొండవాలు ప్రాంతాల్లో సమస్యల పరిష్కరించాలనికార్పొరేటర్  మొల్లి హేమలత డిమాండ్ !

మధురవాడ:

గ్రేటర్ విశాఖ ఐదవ వార్డ్ కొండవాలు ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు వార్డు కార్పొరేటర్  మొల్లి హేమలత తెలిపారు.ఈ మేరకు వార్డు పరిధిలోని అయ్యప్ప నగర్, వివేకానంద కాలనీ, ముత్యాలమ్మ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్, శివశక్తి నగర్ పరిసర  కొండవాలు ప్రాంతాలను కార్పొరేటర్ పర్యటించి స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత స్థానిక మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇక్కడ తాగునీటి సమస్య పరిష్కారానికి మొత్తం పనులు ప్రాజెక్టుగా కింద చేపట్టిన అధికారులు ప్రాజెక్టు పూర్తయిందని చెబుతుంటే మరోపక్క ఇంటింటికి కొలాయి ఎందుకు రాలేదు, తాగునీరు సమస్య ఎందుకు తీరలేదో అర్థం కాని ప్రశ్నగా  మిగిలిందని విస్మయం వ్యక్తం చేశారు.


కొండ దిగువ నుండి సుమారు అరకిలో మీటర్ పైన కొండ ఎగువకు  నీటిని మోసుకెళ్తున్న వారి పరిస్థితి వర్ణాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గ్రేటర్ కమిషనర్ సమక్షంలో పలుసార్లు ఇక్కడి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అవి పరిష్కారానికి నోచుకోక పోవడం ఏమిటని కార్పొరేటర్ ప్రశ్నించారు. ఈ విషయమై పలుమార్లు కౌన్సిల్లో ప్రస్తావించినట్లు ఆమె చెప్పారు.ప్రజల కనీస అవసరాలలో ప్రధానమైన త్రాగునీరును అందివ్వటంలో  అలసత్వం మంచిది కాదని తక్షణమే కొండవాలు ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ హేమలత మరోమారు అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ సెక్రెటరీ మోల్లి లక్ష్మణరావు ,వియ్యపు నాయుడు,   జోన్ టు వాటర్ వర్క్స్ ఏఈ శ్రీహరి, అడ్మిన్ సెక్రటరీ జోగారావు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.