మునగపాక ఆదర్శ పాఠశాల రహదారులపై అధికారులు వెంటనే స్పందించాలి

 మునగపాక ఆదర్శ పాఠశాల రహదారులపై అధికారులు వెంటనే స్పందించాలి.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో గల పాటిపల్లి ఏపీ ఆదర్శ పాఠశాల ప్రారంభమై తొమ్మిది సంవత్సరములు పూర్తయి నప్పటికీ ఇంతవరకు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్లను నిర్మించకపోవడం చాలా దురదృష్టకరం.కనీసం రానున్న విద్యా సంవత్సరానికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్లను నిర్మించి,విద్యార్థులంతా రెట్టింపు ఉత్సాహంతో పాఠశాలకు వచ్చి చదువుకునేందుకు పూలబాట వేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర పాఠశాల సిబ్బంది ఆశిస్తున్నారు.