అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం,మంతిన గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నగరాలు సామాజికవర్గానికి చెందిన ఎనిమిది కుటుంబాలకు చెందిన ఇళ్లు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ అందుబాటులో ఉన్న డైరెక్టర్లను తీసుకొని వెళ్లి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు డైరెక్టర్లు కలిపి తమ సొంత నిధుల నుండి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్.విశ్వేశ్వరరావు ద్వారా అగ్నిప్రమాద బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పిళ్ళా సత్యనారాయణ డైరెక్టర్లు వాండ్రాసి శ్యామల, బాయన మీనాక్షి,పిళ్ళా ఆనందరావు, కొరికాని మోహన్ రావు, కురిటి లోహిత్, సుఖవాసి ఉషారాణి, ఈది చిన్నంనాయుడు, విశాఖ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సభ్యులు పిళ్ళా సూరిబాబు, హ్యాండ్స్ టు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పిళ్ళా వెంకటరమణ, మరియు శ్రీకాకుళం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు, కేఆర్ పురం ఎమ్ పి టి సి పండు పాపారావు, కేఆర్ పురం సర్పంచ్ పండు రాజగోపాల్, కళింగపట్నం సర్పంచ్ తమ్మిన రాజు పాల్గొన్నారు.

.jpeg)