కామ్రేడ్ నాగోతి సింగన్న జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు.
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి.
మధురవాడ,పరిసరాల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరికీ నాగోతి. సూర్య ప్రకాష్ 136 వ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ నాగోతి. సింగన్న మధురవాడ లో ఎన్నో కార్యక్రమములు చేశారని మధురవాడ జడ్పీ హైస్కూల్, క్వారీ సొసైటీ, కార్మికుల కోసం ఎంతో కష్టపడ్డారని ఒక గొప్ప వ్యక్తి మధురవాడ లో జన్మించడం ఎంతో సంతోషకరం. ఆయన ఆశయాలతో ముందుకు వెళుతున్న వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడైన నాగోతి సూర్య ప్రకాష్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని.ఈ సందర్భంగా చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ , పంపిణీ చేయడం జరిగింది.

