శిథిలావస్థ లో ఉన్న పాఠశాలను పరిశీలించిన భీమిలి ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల

 శిథిలావస్థ లో ఉన్న పాఠశాలను పరిశీలించిన భీమిలి ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల.

విశాఖ లోకల్ :భీమిలి ప్రతినిధి

భీమిలి నియోజకవర్గం ఎర్రవానిపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠశాలలోని పిల్లలు అందరు సమీపంలో ఉన్న రామాలయం గుడిని బడిగా మార్చుకుని తరగతులకు హాజరవుతున్నారు అనే విషయం తెలుసుకుని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల మరియు ఆనందపురం జనసేన పార్టీ నాయకులు సోమవారం ఆ పాఠశాలను సందర్శించి వాస్తవ రూపం తెలుసుకుని విద్యార్థులను కలిసి పుస్తకాలు, బిస్కట్లు పంపిణీ చేసారు. అనంతరం ఎమ్ ఈ ఓ ని కలిసి జనసేన తరఫున త్వరగా నూతన పాఠశాల నిర్మించి విద్యార్థుల ప్రాధమిక విద్యా హక్కులను మరియు వారి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేసారు. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి అవంతి శ్రీనివాసరావు మా ఆధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిందిగా కోరారు.