నారాయణ కళాశాల హాస్టల్ భవనం ఐదవ అంతస్తు నుండి దూకి బలవన్మరణంతో ఇంటర్ విద్యార్థి మృతి.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 13:
మధురవాడ పరదేశి పాలెం నారాయణ కళాశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కళశాల మేడ పై నుండి దూకి కోన చంద్ర వంశీ అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సరిగా చదవటం లేదని లెక్చరర్ మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి మృతి చెందినట్లు సీఐటీయూ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్ది స్వగ్రామం రాయపూర్ ఒడిసా వాసిగా గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం పీఎంపాలెం పోలీసులు కేజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు ను పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కొద్ది రోజుల క్రితం చెయ్యి విరిగి సెలవు పై ఇంటికి వెళ్లారు. ఇటీవల తిరిగి కళాశాలకు వచ్చారని అన్నారు. కళాశాల ఉపాధ్యాయులు పరీక్షలు దగ్గర పడ్డాయి సిలబస్ పూర్తి చేయకపోతే పరీక్షలలో ఉత్తిర్నత కాలేవు అన్న విషయాన్ని విద్యార్థి బలంగా తీసుకున్నారని అన్నారు. ఉపాధ్యాయులు అన్న మాటను తీవ్రంగా మనస్థాపానికి గురయ్యి బుధవారం రాత్రి కళాశాల హాస్టల్ భవనం ఐదవ అంతస్తు నుండి దూకి బలవన్మరణం పొంది మృతి చెందాడని తెలిపారు. విద్యార్థి భవనం పైనుండి దూకి మృతి చెందిన స్థలంలో రక్తపు మరకలను కడిగి వేయటంతో సీఐటీయూ మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తీవ్రంగా అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు విద్యార్థి కుటుంభ సభ్యులు ఆధ్వర్యంలో మరణించిన ప్రదేశంలో విషయాన్ని బందువులకు సూచించకుండా కడిగేశారని ఆలా కళాశాల యాజమాన్యం చేయటంపై అనుమానాలు ఉన్నాయని రాజ్ కుమార్ అన్నారు. ఈ ఘటన స్థలానికి సుమారు 100కు పైగా వివిధ పోలీస్ స్టేషన్ల నుండి గస్తీకి రావటంపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వారు ఎక్కడికక్కడ భారీ కేడ్లు ఏర్పాటు చేసి అటు మీడియా ని కాని ఎటువంటి ప్రజా ప్రతినిధులను కాని అనుమతించక పోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి బలవన్మరనం తోనే మృతి చెంది ఉంటి ఇంత బందోబస్తు తో ఎవరిని అనుమతించక పోవటం తో అనుమానాలకు తావిస్తున్నారని అన్నారు. పోలీసులు ఘటన పై వివరాలు తెలపకుండా గొప్యత ఎందుకు పాటిస్తున్నారో అంటూ ఇప్పటికైనా తెలపాలని కోరుతున్నారు.పీఎంపోలీసులు మృతదేహన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం పలు విద్యార్థి సంఘాలు నారాయణ కళాశాల గేట్ వద్ద విద్యార్థి కుటుంభ సభ్యులతో బైటాయించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చెయ్యాలని తీవ్ర నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాలకు మద్దతుగా మధురవాడ జోన్ సీఐటీయూ నేతలు నిలిచారు. నిరసన తీవ్ర తరం కావడంతో పోలీసులు భారీగా మొహరించి విద్యార్థి సంఘాల సభ్యులను, సీఐటీయూ నేతలను పోలీసు వాహనాల లోనికి ఎక్కించి ఆనందపురం, పీఎంపాలెం పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు వాహనాలు ఎక్కించే సమయంలో పోలీసులకు విద్యార్థి సంఘాల సభ్యులకు వాగ్ వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేయటం పై విద్యార్థికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. పోలీసులు విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ చేయకుండా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ఉన్నత అదికారులు చొరవ తీసుకుని విచారణ చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరారు.