ఆయుర్వేద వైద్యం పై ప్రభుత్వం రూపొందించిన యాప్ పై అవగాహన ర్యాలీ.

ఆయుర్వేద వైద్యం పై ప్రభుత్వం రూపొందించిన యాప్ పై అవగాహన ర్యాలీ.                   

మధురవాడ : న్యూస్ విజన్ : నవంబర్ 28: 

అవగాహన ర్యాలీలో పాల్గొన్న జోన్1 ప్రాంతీయ ఉప సంచాలకులు ఆయుష్ విభాగము ఝాన్సీ లక్ష్మి భాయి.                                              

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దేశ్ కా ప్రకృతి పరీక్షన్ అభియాన్ కాంపెయిన్ (Desh ki prakruti parikshan Abhiyaan) దేశ వ్యాప్తంగా (ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ కారక్రమమును జోన్1లో వున్న ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3జిల్లాలు జోన్1 ప్రాంతీయ ఉప సంచాలకులు ఆయుష్ విభాగము డాక్టర్ ఝాన్సీ లక్ష్మి భాయి ఆదేశాలతో మధురవాడ బుధవారం ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సుమ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యం పై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  ముఖ్య అతిధిగా జోన్1 ప్రాంతీయ ఉప సంచాలకులు ఆయుష్ విభాగము డాక్టర్ ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఆమెకు  మధురవాడ ఆయుర్వేద వైద్య సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జోన్1 ప్రాంతీయ ఉప సంచాలకులు ఆయుష్ విభాగము ఝాన్సీ లక్ష్మి భాయి పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ (Desh ki prakruti parikshan Abhiyaan)లో ప్రతీ ఒక్క పౌరులు నమోదు చేసుకోవాలని సూచించారు.   ఆయుర్వేద వైద్యాధికారులు వైద్యశిబిరాలు, వీధినాటకాలు, ర్యాలీ మరియు ఇతరకారక్రమముల ద్వారా ఆయుర్వేద వైద్యమును ప్రజలలో అవగాహన తీసుకు రావడానికి కృషి చేయవలెనని తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం ప్రతివ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని గుర్తించి, ఆ వివరాలు ఆధారంగా ఆరోగ్య స్థితిగతులనుమరియు జీవనశైలి విధానాన్ని పొందు పరుస్తుందన్నారు. ఆయుర్వేదం ద్వారా ప్రజల ఆరోగ్యo పై ఆసక్తి కలిగించే ప్రాధాన్యతను సంరక్షణకు ఇది మరింత దోహదపడుతుంది అని అన్నారు. ఆయుర్వేద పద్దతుల్లో నిర్వహించడం, ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆరోగ్య సూచనలు, ఆహారనియమం అనుకూల మార్గదర్శకాలను అందించటం ఈ యాప్ యొక్క లక్షణం కావున ప్రతి జిల్లాలో కనీసం 10లక్షల వరకు ప్రతి పౌరుడు ఈ యాప్ ని వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం నవంబర్ 26 నుండి డిసెంబర్ 25 వరకు నెలరోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సంకల్పం ను  జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధురవాడ పౌర సేవా సంఘం అధ్యక్షులు నాగోతి సూర్య ప్రకాష్, సంఘం సభ్యులు, ఆయుర్వేద వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.