ఆరవ వార్డ్ జనసేన మహిళా కో ఆర్డినేటర్ ప్రమీలారాణి ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేసిన భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల.
మధురవాడ జనసేన మహిళా
కో-ఆర్డినేటర్ ప్రమీలారాణి
ఆధ్వర్యంలో ఆరో వార్డులో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా
నిర్వహించారు. స్థానిక సాయిప్రియ లే ఔట్లో
ఆదివారం ఆ వార్డు అధ్యక్షులు
సంతోష్నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనసేన భీమిలి నియోజకవర్గ
ఇంఛార్జ్ సందీప్ పంచకర్ల ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన పార్టీ పతాకాన్ని
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సందీప్
మాట్లాడుతూ జనసేన పార్టీ భీమిలిలో రోజురోజుకూ బలం పుంజుకుంటుంది అని
అనడానికి జెండా ఆవిష్కరణలే నిదర్శణమని అన్నారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతలో ఇప్పటికే మూడు చోట్ల జెండా ఆవిష్కరణలు చేశామని, రానున్న రోజుల్లో
మరిన్ని జెండా ఆవిష్కరణలు చేస్తామన్నారు. జనసేన బలోపేతానికి కృషి చేస్తున్న
జనసైనికులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రమీలా రాణి
మాట్లాడుతూ సాయిప్రియ గడ్డ జనసేన అడ్డాగా మారనుందని హామి ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో జనసేన నాయకులు శాఖరి శ్రీనుబాబు, క్రిష్ణయ్య, నక్కా శ్రీధర్, 5వ
వార్డు అధ్యక్షులు దేవర శివ, పోతిన అనురాధ, గరే సన్నాయమ్మ, కనకరావు మాస్టర్, అప్పలరాజు, చిట్టిబాబు, అనిల్ సింగ్, సుబ్రమణ్యం, దుర్గ, దత్త, సునీల్, సాయి
తదితరులు పాల్గొన్నారు.
