తూర్పుకాపు యువనేత మోహన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా తూర్పుకాపు వర్తకుల ఆత్మీయ సమావేశం

తూర్పుకాపు యువనేత మోహన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా తూర్పుకాపు వర్తకుల ఆత్మీయ సమావేశం:-

అరసవిల్లి : వి న్యూస్ : జనవరి 06:

రాష్ట్ర తూర్పుకాపు యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు, తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థపక అధ్యక్షుడు గంటెడా మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ ఆత్మీయ సమావేశం శ్రీకాకుళం జిల్లాలో  అరసవిల్లి రోడ్డులో ఉన్న ఇందిరా విజ్ఞాన్ భవన్ ఫంక్షన్ హాల్ లో 2024 జనవరి 7 వ తారీఖున అట్టహాసంగా జరగనున్నది.ఈ సమావేశంలో తూర్పుకాపు పారిశ్రామాక వేత్తలు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ , చిన్న పెద్ద వ్యాపార వేత్తలు, మరియు వివిధ వ్యాపారలలో ఉన్న తూర్పుకాపు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు అవ్వనున్నారు. ఈ సందర్బంగా మోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతిని ఎకతాటిపైకి తీసుకురావడం కోసం ,పరస్పర సహాయాసహకారాలు అందించుకుంటూ వ్యాపారాలను  ప్రోత్సాహించడం కోసం , ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందటమే ముఖ్య లక్ష్యంగా ఈ మీటింగ్ నిర్వహించడం జరగనున్నది అని తెలియచేసారు.ఈ మీటింగ్ కి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,ఉదయం 10 గం"లకు ఇందిరా విజ్ఞాన్ భవన్  ఫంక్షన్ హాలు,అరసవిల్లి రోడ్ శ్రీకాకుళం వేదికగా ప్రారంభం అవుతుందని, ఈ మీటింగ్ కి వచ్చే వాళ్ళు అడ్మిన్ టీమ్  9959083462, 8919738383,9704070503 కి సంప్రదించాలని తెలియచేసారు.