అన్నార్తులకు ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్; తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్

అన్నార్తులకు ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్; తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్

శ్రీకాకుళం: వి న్యూస్ : జనవరి 06:

అన్నార్తులకు ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్ పేరుతో ఆకలి తీర్చే కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలో ఇప్పటికే 270రోజులకు పైగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గార, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో రైస్ మిల్లు వద్ద పడికాపులు కాస్తున్న రైతులకు ట్రాక్టర్ డ్రైవర్లకు కార్మికులకు అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ద్వారా ఎంతోమంది కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల వారికి భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రైతులు రైస్ మిల్లుల వద్ద నిరీక్షిస్తున్న సమయంలో వారికి భోజనం అందించే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అంతేకాకుండా ధాన్యం తరలించే ట్రాక్టర్ డ్రైవర్లకు కార్మికులకు కూడా భోజనం అందిస్తున్నామని ఈ కార్యక్రమానికి అందరు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు రైతు సంఘం అధ్యక్షులు ముకల్ల శ్రీను, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకట రమణమూర్తి, మాజీ PHC అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకర్ రావు, TNSF నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, యూత్ లీడర్ కుంచాల సురేష్, పొన్నాడ ప్రసాద్, పొన్నాడ కిషోర్, మైలపిల్లి మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ..