మధురవాడ జోన్ శిష్ట కరణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ
మధురవాడ: వి న్యూస్ : జనవరి 07:
మధురవాడ జోన్ శిష్ట కరణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ స్వతంత్ర నగర్ లో ఆదివారం నిరుపేదలకు సంక్రాంతి పండుగ కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జోన్ అషిసియేషన్ కమిటీ పెద్దలు హాజరై మాట్లాడుతు పేదల ఆకలి తీర్చేవిధంగా మధురవాడ జోన్ శిష్ట కరణాల సంఘం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నామని, ఈ క్రమంలోనే సంవత్సరం కూడా సుమారు 150 నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించడానికి ముందుకు వస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అద్యక్షులు నౌపాడ ఆనంద్ రావు, బి.వి.ఎన్ పాత్రో, కే. గోవింద్ రావు, కే. నీలకంఠేశ్వరరావు, యు. కొండలరావు, డి. మోహన రావు, బి. అనురాధ, నీలకంఠేశ్వరరావు, కే. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
