కాలుష్య నివారణ దృష్యా మట్టి విగ్రహాలే మేలు అంటున్న అవంతి

కాలుష్య నివారణ దృష్యా మట్టి విగ్రహాలే మేలు అంటున్న అవంతి.

మదురవాడ : ( వి న్యూస్ ప్రతినిధి) సెప్టెంబర్ 17;

ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో మదురవాడ జోన్ 7వ వార్డు మిథిలాపురి ఉడా కోలనీ లో వినాయక చవితి పురష్కరించుకుని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు  చేతులు మీదుగా గణేషుని మట్టి ప్రతిమలను ఉచితంగా  స్థానికులు కు అందజేయడం జరిగింది .

కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ మనకు ఎంతో సిరి సంపద ఆస్తులు అంతస్తులు సౌబాగ్యం  ఉన్నా దైవ సంకల్పం తో కూడిన శక్తి తోడు లేకపోతే ఎంత ఉన్నా ఉన్నదంతా శూన్యం సృష్టి సైతం నడిపించే  అంతటి దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలని,రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలు తో ఎక్కడా ఎలాంటి ఘటనలు తావివ్వకుండా సంఘీభావం తో  జరుపుకోవాలి,అందరూ కాలుష్యాన్ని నివారణ లో బాగంగా మట్టితో చేసిన విగ్రహాలను ఉపయోగించుటకు సంపూర్ణ ప్రాధాన్య ఇవ్వాలని పిలుపునిస్తూ మాట్లాడారు 

ఈ కార్యక్రమంలో జీవియంసి  వైసిపి శ్రేణులు - ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ వారు తదితరులు పాల్గొన్నారు.