పాదచారుల వంతెన కొరకు.నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ కి వినతిపత్రం.

పాదచారుల వంతెన కొరకు.నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ కి వినతిపత్రం.

మధురవాడ :పెన్ షాట్ :జులై 25:

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ 

చింతాడ. సతీష్ కుమార్ ని మంగళవారం భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షుడు తాతపూడి ప్రదీప్ కుమార్ వినతిపత్రం అందచేసి విజ్ఞప్తి చేసారు.

 ఈ సందర్భంగా మధురవాడలో వున్నటువంటి చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ లెవెల్లో పేరుపొందినటువంటి పాఠశాల అని తెలియచేసారు.అయితే ఈ పాఠశాలలో 4,500 మంది విద్యార్థిని, విద్యార్థులు కలిగినటువంటి పాఠశాల,అయితే పాఠశాల జాతీయ రహదారికి ఆనుకొని వుండడం కారణంగా పిల్లలు నిత్యం జాతీయ రహదారిని దాటవలసిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఇరువైపులా జాతీయ రహదారికి ఆనుకొని సుమారు 2 లక్షల 50 వేల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం. కార్షెడ్ నుండి మారికవలస వరకు ఏ ఇంటినుండి అయిన సామాన్లు కొనుక్కోవాలన్నా.. పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా, కాలేజీ విద్యార్థులు కాలేజీకి వెళ్ళాలన్నా అలాగే ఏ పనిమీదైన వృద్ధులు వెళ్ళాలన్నా ఎవరైన మార్కెట్ చేసుకోవాలన్న తరుచూ జాతీయ రహదారి దాటి వెళ్ళాల్సి వుంటుంది. ఇటువంటి జాతీయ రహదారికి గ్రామాల రోడ్లు ఆనుకొని ఉండడం కారణంగా మరియు పాదచారులు నిత్యం రోడ్డును దాటుతున్నప్పుడు తరచూ ప్రమాదాలకి ప్రజలు గురిఅవుతూ వుండడం జరుగుతుంది. ఇటీవలే జూలై 3, 2023 తేదిన (సోమవారం) ఉదయం చంద్రంపాలెం పాఠశాల కు వెళుతున్న ముగ్గురు విద్యార్థులు  జాతీయ రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదానికి గురి అయ్యారు. 9వ తరగతి చదువుతున్న ఎస్. రాజేష్, 10వ తరగతి ఎస్. సుమంత్, 7వ తరగతి ధనుష్ విద్యార్థులకు కాళ్ళు, చేతులు విరిగి హాస్పటల్ పాలవ్వడం జరిగింది. అ తరువాత 22వతేదీ (శనివారం) ఉదయం 10 గంటల సమయంలో మధురవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద  జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకోని 18 సం॥ల యం.ఎల్.టి.జి.టి.యం.ఆర్. కాలేజీ చదువుతున్న విద్యార్థిని శిరా. షర్మిల అనే విద్యార్థి యొక్క రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోవడంతో కె.జిహెచ్లో రెండు కాళ్ళు తీసివేయడం జరిగింది. కాబట్టి దీనిపై అధికారులు దృష్టి సారించి ఫై పాదచారుల వంతెన నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరుపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని ప్రదీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ 9వ వార్డు అధ్యక్షుడు బి. అభిరామ్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.