మిదిలాపురి ఉడాకాలనీలో ఎస్ఐ వెంకటరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
మధురవాడ: వి న్యూస్ : జూన్ 05:
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ జంక్షన్లో నేరాలు నియంత్రణలో భాగంగా ఉన్నతధికారులు ఆదేశాలతో స్పెషల్ పోలీస్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ పీఎం పాలెం వెంకటరావు ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సుమారు 80 వాహనాలను తనిఖీ చెయ్యగా ముగ్గురు మద్యం సేవించి వాహనాలు నడిపినవారు సుమారు 25వాహన దారులు రికార్డులు సరిగా లేకుండా నడుపున్నవారికి కేసులు నమోదు చెయ్యడం జరిగిందని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. ఈ డ్రైవ్ లో ట్రాఫిక్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది పాల్గొన్నారు.

