సింహాచలం దేవస్థానం పరిసరాలలో పరిశుభ్రత లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న భక్తులు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా సింహాచలం దేవస్థానం పరిసరాలలో కనిపించిన దృశ్యాలు
సింహాచలం దేవస్థానంలో సిబ్బంది నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా?
సింహాచలం: వి న్యూస్ : జూన్ 05:
విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పరిసరాలలో ఎక్కడ చూసిన చెత్త కనిపిస్తుందని చెత్త పేరుకుపోయి నీరు నిలబడిపోయి దుర్వాసన వస్తోందని నీటిలో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండటం తో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం స్వామివారికి తలనీలాలు సమర్పించి స్నానాలకు వచ్చిన భక్తులకు కొళాయిల వద్ద ఎక్కడ అడుగువేసిన చెత్త దర్శనం ఇవ్వటం తో స్నానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి దేవస్థానం సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పారిశుధ్య సిబ్బందిసరిగా విధులు నిర్వహించకపోతే పై అధికారులు పట్టించు కోరా అంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు చెల్లించిన కానుకలు మొక్కులు చెల్లించుకుంటేనే కదా మీకు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు అటువంటి భక్తులకు మౌలిక వసతులు కల్పించవలసిన భాద్యత మీ పై ఉంటుంది కదా అంటున్నారు.

.jpeg)
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
