రాబోవు మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు ..
కోనసీమ: వి న్యూస్ : జూన్ 03 :
8 నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వాతావరణశాఖ అంచనా ..
రాష్ట్రంలో రాబోవు మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
రేపు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం
ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం
ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది
ఈ నెల 4 నాటికి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకి 12 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించే వీలుంది.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
