ఘనంగా గంటా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు

 ఘనంగా గంటా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు

ఆనందపురం : వి న్యూస్ ప్రతినిధి

 మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు వర్ధమాన సినీ హీరో గంటా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు తాళ్ల వలసలో ఘనంగా జరిగాయి. టిడిపి యువ నాయకుడు, వేములవలస ఉపసర్పంచ్రా కొరడా నవీన్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగ భూషణరావు ఆర్థిక సాయం అందజేశారు. 

ఆదివారం  మండలంలోని పెద్దిపాలెం సమీపంలో తాళ్లవలస వద్దగల మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అనాధ బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేసి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. సుమారు 30 మంది పిల్లలకు స్వీట్ బాక్స్లు స్నాక్స్, స్టేషనరీ అందజేశారు.  ఈ సందర్భంగా నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా గంటా రవితేజ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ముడసల శ్రీను,  వడ్ల భార్గవ్,  బాలు, వెంపాడ కుమార్,  శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.