డిస్ట్రిక్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్ షిప్స్ లో సెకండ్ ఓవరాల్ ఛాంపియన్ షీప్ గా నిలిచిన యూత్ టైక్వాండో అసోసియేషన్.

 డిస్ట్రిక్ ఓపెన్ టైక్వాండో  ఛాంపియన్ షిప్స్ లో సెకండ్ ఓవరాల్ ఛాంపియన్ షీప్ గా నిలిచిన యూత్ టైక్వాండో  అసోసియేషన్.

విశాఖ లోకల్: మధురవాడ ప్రతినిధి

ఇటీవల ఆదివారం గాజువాక  కు చెందిన మారువల్ స్కూల్లో జరిగిన జిల్లా ఓపెన్ స్థాయి టైక్వాండో పోటీల్లో మధురవాడ కు చెందిన యూత్ టైక్వాండో క్రీడాకారులు  ప్రతిభ కనపర్చడమే కాకుండా సెకండ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ గా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు 18 బంగారు పతకాలు,  4  రజిత పతకాలు , 4 కాంస్య పతకాలు,  సాంతం చేసుకొన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలను జిల్లా  టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి యమ్.అచ్చం నాయుడు గారు, జాయింట్ సెక్రటరీ యన్. సత్యనారాయణ గారు మరియు ఒరిస్సా టైక్వాండో అధ్యక్షుడు సంతోషకుమార్ గారు  మరియు యూత్ టైక్వాండో  సెక్రటరీ యమ్. సురేష్ గారు అధ్యక్షుడు కె. సుకుమార్ సంపత్ గారు టీమ్  మేనేజరు  నవీన్ కుమార్ మరియు యెస్. దీపక్ అభినందించారు. బంగారు పతాక విజేయతలు: గాయత్రి, యోచన, భాసిత, సిరి, ఆర్షవర్ధన్, మహేశ్వరవు, సుదీర్, విశాల్, జస్వంత్, కార్తికేయ, జస్వంత్ సాయి సూర్య, ధన లక్ష్మీ, భావన, రూపావతి, మణికంఠ, సాయి ప్రతాప్, సురేష్, దీపక్,  అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు.
రజిత పతాక విజేయతలు: వెంకట శ్రీకర్, బాలచందర్, ఉదయ్ నిఖిల్, నాగ చరణ్,  రజత పతకాలు సాధించారు.
కాంస్య పతాక విజేయతలు: వివేక్ అభి సాయి, సత్యనారాయణ, అభి, జీవన్ కుమార్,  కాంస్య పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో యమ్. సురేష్  మరియు కె.సుకుమార్ సంపత్ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో యూత్ టైక్వాండో  మధురవాడ కు సెకండ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్  రావడం ఎంతో గర్వంగా ఉంది అని  పిల్లలకు చదువు తో పాటు ఆత్మ రక్షణకు మరియు విద్య, ఉద్యోగ, గాల కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని పేర్కొనడం జరిగింది. ఈ క్రీడాకారులును యూత్ టైక్వాండో ప్రతినిదిలు మరియు క్రీడాకారుల తల్లి దండ్రులు అభినందించారు.