జివిఎంసిలో “డయల్ యువర్ మేయర్” మరియు “స్పందన” కార్యక్రమములు నిర్వహణ .

 జివిఎంసిలో “డయల్ యువర్ మేయర్” మరియు “స్పందన” కార్యక్రమములు నిర్వహణ.

విశాఖ లోకల్:

సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నిర్వహించగా, 20 ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందినవి. స్పందన కార్యక్రమం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలసి మేయర్ నిర్వహించారు. డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరింగ్ విభాగమునకు 03, పట్టణ ప్రణాళికా విభాగమునకు 11, పబ్లిక్ హెల్త్ విభాగమునకు 03, రెవెన్యూ విభాగమునకు 01, యుసిడి విభాగమునకు 01, ఇతరులు 01, మొత్తము 20 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.

 

“స్పందన” కార్యక్రమంలో స్వీకరించిన 82 ఫిర్యాదులు:  

“స్పందన” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా స్వీకరించిన ఫిర్యాదులు ఒకటవ జోనుకు 03, రెండవ జోనుకు 04, మూడవ జోనుకు 16, నాలుగవ జోనుకు 13, అయిదవ జోనుకు 16, ఆరవ జోనుకు 08, ఏడవ జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 07, మెయిన్ ఆఫీసునకు 13, మొత్తము 82 ఫిర్యాదులు స్వీకరించారు.

 

ఈ కార్యక్రమం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, “స్పందన” కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు సంబందిత అధికారులు తక్షణమే పరిష్కార మార్గం చేపట్టి, సమస్యలు పరిష్కారమైనవీ, లేనివీ ఫిర్యాదు దారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ వారం వచ్చే ఫిర్యాదులు వచ్చే వారం మరలా రాకుండా ఉండేటట్లు నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించాలన్నారు. పైన తెలిపిన ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ.వి. రమణి, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు,    సిసిపి ఎ. ప్రభాకర రావు, జెడి(అమృత్) విజయ భారతి, సిఎంఒహెచ్ డాక్టర్ కెఎస్ఎల్ జి శాస్త్రి, ఎ.డి.(హార్టికల్చర్) ఎం. దామోదర రావు, డి.సి.(రెవెన్యూ) పి. నల్లనయ్య, డిఇఒ శ్రీనివాస రావు, సెక్రటరి ఎం.వి.డి. ఫణిరాం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి, డిపిఒ సూర్యకుమారి, ఎసిపి రమణ మూర్తి, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, కె.వి.ఎన్. రవి, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు, శ్యాంసన్ రాజ్, గోవింద రావు, ఎఫ్.ఎ.& ఎ.ఒ. మల్లికాంబ, తదితరులు పాల్గొన్నారు.