·
ప్లాస్టిక్
నియంత్రణ పై సైకిల్ యాత్ర
·
విశాఖ వాసి సందేశ
యాత్ర
· అభినందించిన నగర మేయర్.
ప్లాస్టిక్ నియంత్రణ, నిర్మూలనపై
అవగాహన కొరకు సందేశాత్మకమైన కార్యక్రమాలను చేపట్టుటకు యువతీ యువకులు ముందుకు
రావాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తన
చాంబర్లో 11వ
వార్డు ఆరిలోవ బాలాజీ నగర్ అప్సరా కోలనీకి చెందిన బంతు సంపత్ వెంకట సాయి ముఖేష్
ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన పరుస్తూ ”సే నో టు ప్లాస్టిక్” అనే నినాదంతో తన ఇంటి నుండి కన్యాకుమారి వరకు
సైకిల్ పై ఒంటరిగా సందేశాత్మకమైన యాత్రను ముగించి విశాఖ చేరుకున్న తరుణంలో ఆ
యువకుడిని అభినందించిన మేయర్ సన్మానించారు
ఈ అభినందన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ
ఇప్పటికే విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణపై జివిఎంసి పలు అవగాహన
కార్యక్రమాలు విస్తృతంగా జరుపుతుందన్నారు. సంపత్ వెంకట సాయి ముఖేష్ చేసినటువంటి సందేశాత్మకమైన అవగాహన యాత్రా కార్యక్రమాలు కూడా
చేపట్టేందుకు యువతీ యువకులు ముందుకు
రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆరిలోవకు చెందిన విశాఖవాసి సంపత్ 23 రోజుల
పాటు ఒంటరిగా కన్యాకుమారి వరకు చేసిన సైకిల్ యాత్ర అభినందించదగినదని, పలువురికి స్ఫూర్తి దాయకమని మేయర్
అన్నారు. ఈ సైకిల్ యాత్ర చేసిన సంపత్ నా వార్డు నివాసి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మేయర్ ఆనందం
వ్యక్తం చేశారు.
అనంతరం సైకిల్ యాత్ర చేసిన సంపత్ వెంకట
సాయి ముఖేష్ మాట్లాడుతూ మనదేశంలో ప్లాస్టిక్ నిర్మూలనకు, నియంత్రణ కొరకు నావంతు అవగాహనతో కూడిన సందేశాత్మకమైన సైకిల్ యాత్ర
చేయాలనుకుని నిర్ణయించుకొని పూర్తి చేశానన్నారు. సైకిల్ యాత్ర ప్రారంభంలో డాక్టర్
ఎల్.బి.కాలేజీ యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థుల సహకారం, రామానంతపురం, రామేశ్వరం,
తొండి తదితర ప్రాంతాల్లో ధాన్ పౌండేషన్ వారి సహకారం మరువలేనిదన్నారు.
కన్యాకుమారిలో ఆర్మీ కర్నల్ అధికారి ప్రసాద్ సహకారం కూడా మరువలేనిదని, ఈ సైకిల్
యాత్ర ఒంటరిగా 23 రోజులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి
రాష్ట్రాల్లో చేయడమైనదన్నారు. విశాఖ నుండి కన్యాకుమారి వరకు ఈస్ట్ కోస్ట్ రోడ్డు
మార్గం ద్వారా ఈ సైకిల్ యాత్రను విజయవంతం చేయడం అయిందన్నారు. నాలాగే ప్రతి యువతీ యువకులు నగరం, రాష్ట్రం,
దేశాభివృద్ధి కోసం ముందుకు వచ్చినట్లయితే మన దేశం ప్లాస్టిక్ రహిత దేశంగా
ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి
నాయకులు గొలగాని శ్రీనివాసరావు, సంపత్ కుటుంబ సభ్యులు, బందువులు, తదితరులు
పాల్గొన్నారు.
