శ్రీ పైడిమాంబ అమ్మవారి 28వ పండగ ఏర్పాట్లు పూర్తి.
విశాఖ జిల్లా:
మధురవాడ*:
విశాఖ జిల్లా మధురవాడ శ్రీపైడిమాంబ అమ్మవారి 28వ పండగ మహోత్సవ సందర్భంగా. జీవీఎంసీ,మధురవాడ 7వ వార్డు పరిధి స్వతంత్రనగర్ రోడ్డు డాక్ యార్డ్ కాలనీ లో కొలువై ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి పండగ,28 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మనిగాంకుమార్ మీడియాతో మాట్లాడుతూ . మంగళవారం ఉదయం పసుపు కుంకుమ పూజలు,అభిషేకాలు జరిగాయని తెలిపారు,సాయంత్రం నాలుగు గంటల నుండి మేళ తాళాలతో గ్రామ తిరు వీదులలో అమ్మవారి ఘటాలు ఊరేగింపు అనంతరం నక్షత్ర హరతి నీరాజనాలు తో ముగుస్తుంది.23వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నసంతర్పణ జరుగుతుందని,కావున మధురవాడ పరిసర గ్రామాల ప్రజలు అంతా అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు ఘనంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా ఈ అమ్మవారు పేరు పొందారన్నారు,అంతే కాకుండా అమ్మవారు ఆయాగ్రామాల ప్రజలను నిరంతరం రక్షిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు ఆర్.లోకేష్, సాయి,ఈశ్వరరావు, పాపారావు,రాజు,యు.లోకేష్, అర్జున్,చిన్న తదితరులు పాల్గొన్నారు.
