మధురవాడ కళింగ సేవా సంఘం అధ్యక్షులుగా బగాది లక్ష్మణరావు ఎన్నిక...
మధురవాడ : వి న్యూస్ : ఫిబ్రవరి 26:
\మధురవాడ కళింగ సేవా సంఘం అధ్యక్షులుగా శివశక్తి నగర్ ప్రాంతానికి చెందిన బగాది లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జీవీఎంసీ ఐదో వార్డ్ పరిధిలో చిలుకూరి లేఔట్ ప్రాంతంలో సామాజిక ( కలింగ) భవనంలో మధురవాడ కళింగ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. విశ్రాంత ఎస్పీ ప్రసాదరావు, అటవీ శాఖ అధికారి బిర్లంగి నరేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నిక నియామకం లో అధ్యక్షులుగా బగాది లక్ష్మణరావు ( బిఎల్ఆర్) , గౌరవ అధ్యక్షులుగా అయోధ్య నగర్ కు చెందిన సిపాన వెంకటరమణ, కార్యదర్శిగా సాయిరాం కాలనీకి చెందిన గురుగువెళ్లి యోగేశ్వరరావు, కోశాధికారిగా అదే ప్రాంతానికి చెందిన బొడ్డేపల్లి రంగారావు ను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన లక్ష్మణరావు మాట్లాడుతూ... కళింగ సామాజిక వర్గానికి విద్యా వైద్య ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించేలా అందరం సమిష్టి గా కృషి చేద్దామని, ప్రధానంగా సేవాస్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలను కళింగ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపడతామని, అందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని, ఈ నూతన కమిటీలో మరికొందరికి పదవులు కల్పించి కమిటీని మరింత బలోపేతం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నూతన కమిటీ ఎన్నికకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.