పద్మనాభం మండల కార్యాలయం ఆవరణలో బీమిలి డివిజన్ ఆర్ డి ఓ మరియు తహసీల్దార్ ని కలిసిన పాండ్రంగి గ్రామ పెద్దలు.
పద్మనాభం : వి న్యూస్ :మే 23
బిజెపి ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలరమణ (శ్రీను )గ్రామ పెద్దలు వైస్సార్సీపీ సినియర్ నాయుకులు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు. ఆర్ ఎస్ .దేముడుబాబు, కొసర అప్పలనాయుడు కలిసి
పాండ్రంగి గ్రామంలో అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు అమ్ము కొంటున్న వైస్సార్సీపీ నాయుకులు పాండ్రంగి పి ఏ సి ఎస్ చైర్మన్ అముజురి అప్పారావు ఎంపీటీసీ పిన్నింటి నారాయణమ్మ భర్త పిన్నింటి రమణ మరియు పాండ్రంగి ఇటుక బట్టీలకు బూడిద, మట్టి కొనుగోలు ఏజెంట్ పొట్నూరు అప్పలరాజు ఈ ముగ్గురు వైస్సార్సీపీ నాయకులుఫై పిర్యాదు చేసారు.
పాండ్రంగి గ్రామం లొ అనేక అక్రమాలకు పాల్పడుతున్న దానిలో భాగంగా గత నాలుగు రోజుల నుండి పాండ్రంగి పంట పొలాలలో పంట కాలువ సర్వే నెంబర్ 384 /1 వెడల్పు 2మీటర్లు పొడవు 1300 మీటర్లు లో ఉన్న కాలువమట్టిని జేసీబీ సహాయంతో లారీలలోడ్ చేసి పాండ్రంగి పరిధిలో రాజీవ్ ఇటుక బట్టి మరియు ఇతర బట్టిలకు సుమారు 675 లోడులు రూ.20,00,000/లు ఇరవై లక్షలా రూపాయలు సొమ్ముకు అమ్ము కొన్నారు అని గ్రామప్రజలు ఆరోపణలు చేయగా గ్రామ పంచాయతీ 1వవార్డు సభ్యులు మహంతి అప్పలరమణ (శ్రీనివాస్ ) ఆదివారం ఉదయం 7.30 నిల కు గ్రామ వి ఆర్ ఏ, వి ఆర్ ఓ లు మరియు ఆర్ ఐ సమక్షంలో మట్టి లారీను రేవన్యూ వారికి అప్పగించడం జరిగింది అని తెలిపారు. ఈ ముగ్గురు ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వస్తాయని తెలియజేసినా చర్యలు తీసుకోక పోవడంతో మంగళవారం బీమిలి ఆర్ డి ఓ మరియు పద్మనాభం తహసీల్దార్ కి వ్రాత పూర్వకం గాపిర్యాదు అందచేశారు.