జోన్ 5 లో పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు,ఫిర్యాదు పై స్పందించని అధికారులు.

జోన్ 5 లో పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు.

ఫిర్యాదు పై స్పందించని అధికారులు.

జోన్ 5లో చక్రం తిప్పుతున్న చైన్మాన్

ఉన్నతధికారులను శాసిస్తున్న చైన్మాన్.


జోన్ 5 అధికారుల రూటే సపరేటు..$ నోరు మెదపరు కూలగొట్టరు... 51 వ వార్డు లో నిబంధనలకు విరుద్ధంగా జీవోలను అతిక్రమిస్తూ ప్లాన్లు, నిర్మాణాలు! అన్ని సక్రమమే అని అంటున్న చైన్మన్ ప్రసాద్ రావు. కొన్ని రోజుల క్రితం పలు పత్రికల్లో అక్రమ నిర్మాణం అని వార్తలు,పిర్యాదు నెంబర్లు1021092200117 వచ్చినప్పటికీ జోన్ 5 టౌన్ ప్లానింగ్ అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు' టి.పి.ఓ. శ్రీలక్ష్మి మరియు ఏ.సీ.పి అరుణ వల్లి వరకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు, టి.పి.ఓ పూర్తిగా నాకు సంబంధమే లేదు ఏమైనా ఉంటే ఏ.సి.పి తో మాట్లాడుకోండి అని చేతులు ఎత్తేసారు అసలు జోన్5 లో అధికారులు ఉన్నారో లేదో అనే సందేహాలు వినబడుతున్నాయి. ఎవరెవరికి ఎంత ముట్టిందో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఆ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు 'వెన్ను' కాస్తున్నారు, ప్రభుత్వ ఆదాయానికి ఎందుకు చిల్లులు పెడుతున్నారు,పేదవాడు నిర్మించుకున్న ఇళ్లపై ఫిర్యాదు రాగానే తక్షణమే చర్యలు తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మిస్తున్న'బిల్డర్లు పై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని పలువురు వాపోతున్నారు. పెద్ద మొత్తంలోనే ముడుపులు అందే ఉంటాయని పలువురు అనుకుంటున్నారు.