తాత్కాలిక రాజీనామా చేసిన చంద్రంపాలెం హై స్కూల్ తల్లిదండ్రుల కమిటీ ఉపాధ్యక్షుడు....

 తాత్కాలిక రాజీనామా చేసిన చంద్రంపాలెం హై స్కూల్ తల్లిదండ్రుల కమిటీ ఉపాధ్యక్షుడు....

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి

చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లి తండ్రుల కమిటీ సభ్యుల మధ్య జరుగుతున్న కొన్ని అవకతవకల వల్ల తాను తాత్కాలిక రాజీనామా చేస్తున్నట్టు విద్యార్థుల తల్లి తండ్రుల కమిటీ ఉపాధ్యక్షులు  కిల్లాన పోలి నాయుడు తెలిపారు.

రాష్ట్ర స్థాయి లో ప్రథమ స్థానంలో ఉన్న జీవీఎంసీ జోన్ టు పరిధిలోని చంద్రంపాలెం హై స్కూల్లో తల్లిదండ్రుల ఆమోదం తో ఎన్నికైన పాఠశాల కమిటీ కొత్త కాలంగా దారితప్పుతుంది.కమిటీ లో కొందరు సభ్యులు ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు అని. చంద్రంపాలెం పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగిన పత్రిక సమావేశంలో కిల్లాన పోలినాయుడు  ఆవేదన వ్యక్తంచేశారు.

పాఠశాలకు మంజూరైన నాడు-నేడు పథకంలో తన ప్రమేయం లేకుండా చెక్కుల పైన ఉపాధ్యక్షులు  సంతకం లేకుండా నిధులు బ్యాంకు ఖాతా నుండి  డ్రా చేస్తున్నారని కిల్లాన పోలినాయుడు వ్యాఖ్యానించారు. అలాగే కమిటీలో ఒక క్రమ శిక్షణ కూడా లేదని తనకు ఎవరూ గౌరవం ఇవ్వడం లేదని తల్లిదండ్రులతో ఎన్నుకోబడిన కమిటీలో తాను ఉపాధ్యక్షులు గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఒక గౌరవం దక్కలేదని అలాగే చైర్మన్ కూడా  కమిటీ సభ్యుడు గా  చూడడం లేదని  పోలి నాయుడు అన్నారు.పాఠశాల కమిటీ కి సంభందం లేని ఒక అజ్ఞాత వ్యక్తి మొత్తం కమిటీని తన గుప్పెట్లో  పెట్టుకొని కమిటీ సభ్యులను  నచ్చినట్లు ఆడిస్తు అడిగిన వారిపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని పోలి నాయుడు తెలిపారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబుకి తాత్కాలిక రాజీనామా ఇస్తున్నట్లు తెలుపుతూ దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి మరల కమిటీ ఆమోదంతో రాజీనామాన్ని ఆమోదం చేయాలని మీడియా సమావేశంలో తెలిపారు..