బ్రహ్మర్షి పితామహ పత్రీజీ అమృత మహోత్సవం.
మురళీనగర్:
ది పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్, విశాఖపట్నం ఆధ్వర్యంలో N.R ఫంక్షన్ హాల్ & గెస్ట్ హౌస్, మురళీనగర్, విశాఖపట్నం నందు 'బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ' " అమృతోత్సవం అతి వైభవంగా నిర్వహించబడినది. మేనేజింగ్ ట్రస్టీ రేవతీ దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 'స్వర్ణమాల పత్రి' ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ' స్వర్ణమాల పత్రి' మాట్లాడుతూ ధ్యానం ద్వారా ప్రతిఒక్కరూ 'మానశిక ఆరోగ్యం మరి శారీరక ఆరోగ్యాన్ని పొందుతున్నారని మరి P.S.S.M మూవ్మెంట్ ద్వారా శాకాహార విశిష్టత మరి పర్యావరణ పరిరక్షణ కొరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి విశేషంగా 'పిరమిడ్ ధ్యానులు' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యానులు 'బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ' తో గల తమ అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు మరియు 'బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ' ఆదర్శాలైన 'ధ్యాన జగత్', ' శాఖాహార జగత్ ' మరి ' పిరమిడ్ జగత్ ' లను నిజం చేయడానికి ' స్వర్ణమాల పత్రి' సారధ్యంలో మరింత ముందుకు సాగుతామని ట్రస్ట్ సభ్యులు రత్నకుమారి,ఇందిరా దేవి , రమణమ్మ , సత్యవతి, (వాణి) తెలియచేసారు. ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 'పిరమిడ్ ధ్యానులు ' మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన 'సీనియర్ పిరమిడ్ ' మాష్టర్లందరికీ ట్రస్ట్ సభ్యులు తమ కృతజ్ఞతలను తెలియచేసారు.