వేములవలస ఎస్సీ కాలనీలో మహా అన్నదానం ప్రారంభించిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

వేములవలస ఎస్సీ కాలనీలో మహా అన్నదానం

ప్రారంభించిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

ఆనందపురం: విశాఖ లోకల్ న్యూస్

 వేములవలస ఎస్సీ కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసినందుకు గాను ఉత్సవ కమిటీ శనివారం మహా అన్నదానం  చేపట్టారు. ఈ అన్నసమారాధనకు భీమిలి మాజీ ఏఎంసీ  చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమాన్ని  అతని కుమారుడు స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతోందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ రాచర్ల ముకుందరావ్ వార్డు మెంబర్లు రాచర్ వెంకటరావు, లంక  అప్పారావు,  స్థానిక యువత నడిమింటి అప్పలరాజు, బాలు మహేంద్ర, బోద నారాయణప్పడు ,  సాయి రేఖ ఫోటో స్టూడియో యజమాని మూర్తి, బోద అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.