భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్ధి నాగోతి నాగమణికి బకెట్ గుర్తు ప్రకటించిన ఈ సి
భీమిలి :పెన్ షాట్ ప్రతినిధి : ఏప్రిల్ 29:
ఐదు నెలల నిర్విరామంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో గడపగడపకు ప్రచారం చేసి ప్రజలు తమ యొక్క సింబల్ ఏమీ అని కోరుతుంటే ఆరోజు రానే వచ్చింది అది ఈరోజు కావడం చాలా విశేషం భీమిలి నియోజకవర్గం నాగోతి నాగమణి కి భీమిలి ఆర్డిఓ ఆఫీస్ నందు పేద మధ్యతరగతి ధనిక ప్రజలకు అతి దగ్గరగా ఉండే గుర్తు అందరూ ఉపయోగించుకునే వస్తువు అయినటువంటి బకెట్ సింబల్ ని మన మీ అందరి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణికి రావడం ఆనందంతో ఓటరు ప్రజలు సంబరాలు చేసి ఆమెకు పుష్పగుచ్చం పూలమాల వేసి ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృషికి దక్కిన ఫలితం అని చెప్పచ్చు రేపటి నుంచి ప్రతి ఒక్కరికి నా గుర్తుని దగ్గర చేసే విధంగా ఓ మంచి ప్రణాళికతో ముందుకు వచ్చి ప్రజలకు మరింత దగ్గర అవుతాను అని చెప్తూ ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గానికి ఏ పార్టీ నాయకులు కానివ్వండి ఎవ్వరు మ్యానిఫెస్టోని ఇవ్వలేదు అతి దగ్గరలో మ్యానిఫెస్టోని విడుదల చేయనున్నారని ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తెలియజేస్తూ బకెట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో శాసనసభకు పంపించి భీమిలి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆశిస్తూ మరొకసారి మీ భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలి ప్రజలను ఓటును అభ్యర్థించారు.