సంజయ్ గాంధీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

 సంజయ్ గాంధీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

తూర్పు నియోజకవర్గం:విశాఖ లోకల్ న్యూస్

9 వ వార్డు సంజయ్ గాంధీ కాలనీ లో వినాయకచవితి ఉత్సవాలు లో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మహా అన్నదానం కార్యక్రమం చిన్నపోలమాంభ  సంజయ్ గాంధీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగినది. ఈ  కార్యక్రమం నాకు ముఖ్య అతిధిగా తూర్పునియోజకవర్గం శాసనసభ్యులు  వెలగపూడి రామకృష్ణ బాబు విచ్చేసి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డన చేసారు.

 

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎస్ సి  సెల్ అధ్యక్షులు మరియు 9 వ వార్డు ఇంచార్జి బుడిమూరి గోవింద్, 12 వ వార్డు ఇంచార్జి ఒమ్మి అప్పలరాజు, పార్లమెంట్ ఆర్గనేజింగ్ కార్యదర్శి ఒమ్మి పోలరావు,  ఒమ్మి రాజు ఐటీడీపి ఇంచార్జ్ బాదరు బాలరాజు, 12 వ వార్డు అధ్యక్షులు గాడి సత్యం, సంగమ్ సభ్యులుఒమ్మి గోవిందరాజు,కంచుముర్తి ప్రసాద్, బొట్టా బాలకృష్ణ, బొట్టా శ్రీను పాల్గొన్నారు. అన్నదానం ప్రసాదాన్ని స్వీకరించేందుకు గ్రామస్తులు మరియు ఇతర ఏరియా లలో ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసారు.. భక్తిలు సుమారు 2500 మంది అన్నదానం ప్రసాదాన్ని స్వీకరించరు.