ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం


ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం
.

ఒడిశా: వి న్యూస్ : జూన్ 09

ఒడిశాలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల మూడురైళ్లు ఢీకొన్న ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం సంభవించింది.నువాపాడా జిల్లాలో గురువారం ఆగిఉన్న దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఖరియార్ రోడ్ స్టేషన్‌కు చేరుకోగానే ఏసీ(బీ3) కోచ్ కింది భాగంలో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. గంటలోనే సమస్యను పరిష్కరించిందని, రాత్రి 11 గంటలకు స్టేషన్ నుండి రైలు బయలుదేరిందని వెల్లడించింది. కాగా, వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రైలు ఎక్కాలంటే ఏ ప్రమాదం ఎదురవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.